కలం, ములుగు: ములుగు జిల్లాలోని రెడ్డి వైన్స్ (Reddy Wines)పై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. వైన్స్‌లో అక్రమంగా మద్యం కల్తీ చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ సీఐ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం టెస్టింగ్ చేస్తున్నారు. అలాగే అక్కడికి సంబంధించిన ఓ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మద్యం కల్తీ జరిగిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

