నిర్ణీత గడువులోగా స‌ర్వే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

కలం, వనపర్తి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ సమగ్ర రీసర్వే (Land Resurvey) కీలకమని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ అన్నారు. బుధవారం వనపర్తి (Wanaparthy) మండలం నాచహళ్లి, కొత్తకోట మండలం నాంచారమ్మపేట, పుల్లారెడ్డికుంట గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే రికార్డులు, పనుల పురోగతిని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. రీసర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సర్వేలో రైతులు, గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. భూముల కొలతల సమయంలో సంబంధిత యజమానులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండేలా చూడాలన్నారు. రైతుల సమక్షంలో పారదర్శకంగా సర్వే నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో సర్వే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వనపర్తి తహసీల్దార్ రమేష్‌రెడ్డి, కొత్తకోట తహసీల్దార్ సుభాష్ నాయుడు, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>