epaper
Monday, March 2, 2026
epaper

మహిళల జనేంద్రియాల మ్యుటిలేషన్.. కేంద్రం వైఖరిని కోరిన సుప్రీం

కలం డెస్క్ : మహిళల జననాంగాల మ్యుటిలేషన్ (Female Genital Mutilation – FGM) లేదా ‘ఫిమేల్ సర్కంసిషన్’ అనే ఆచారాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు(Supreme Court)… తగిన వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇస్లాం మతంలో ఇది ఒక ఆచారం కాకపోయినా ‘దావూదీ బోహ్రా ముస్లిం’ వర్గంలో మాత్రం ఒక పద్ధతిగా కొనసాగుతున్నదని చేతనా వెల్ఫేర్ సొసైటీ అనే ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు విన్నవించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం… ఈ పిటిషన్‌లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ప్రత్యేకంగా నిషేధించే చట్టం లేకపోయినా, ఇది భారతీయ న్యాయ సంహితలోని (BNS) పలు సెక్షన్ల కింద గాయపరచడం ఒక నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని పిటిషన్‌లో చేతనా వెల్ఫేర్ సొసైటీ పేర్కొన్నది. ఇది బాలికల, యువతుల హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నది.

పోక్సో (POCSO) చట్టం ప్రకారం, వైద్య కారణం లేకుండా మైనర్ బాలికల జననాంగాలను తాకడం నేరమని గుర్తు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం మహిళల, బాలికల మానవ హక్కులపై ఈ ప్రక్రియను తీవ్రమైన ఉల్లంఘనగా వర్గీకరించిందని గుర్తుచేసింది. ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’లోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నది. ఈ ప్రక్రియ వల్ల మహిళలు, బాలికలు, యువతులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయన్నారు. ప్రసవ సమయంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తి శాశ్వతంగానే శారీరక ఇబ్బందులు కొనసాగుతాయన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుపై కేంద్ర ప్రభుత్వం తరఫున వైద్యారోగ్య శాఖ ఎలాంటి వివరణ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇస్లాం మతంలో ఈ ప్రక్రియ ‘తప్పనిసరి’ కాకపోయినా ఆ మతంలోని కొన్ని సెక్షన్లు పాటిస్తున్నందున మత పెద్దల అభిప్రాయాలను కూడా సుప్రీంకోర్టు(Supreme Court) పరిగణనలోకి తీసుకునే అవకాశమున్నది.

Read Also: రో-కోకు అడ్డంకి లేదు.. అప్పటి వరకు ఆడొచ్చు: మోర్నీ మోర్కెల్

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!