Mobile Popup Ad
Mobile Popup Ad

కల్తీ నెయ్యి కేసు.. మరో 11 మందిని యాడ్ చేసిన సిట్‌

తిరుమల(Tirumala) తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కేసు విచారణను సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేగవంతం చేసింది. కేసులో నిందితులుగా తాజాగా మరో 11 మందిని చేర్చింది. ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు చేసింది. కేసు నమోదు చేసిన తొలి దశలో 15 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్‌, అనంతరం మరో 9 మందిని జాబితాలో చేర్చింది. ఈసారి జాబితాలో చేరిన వారిలో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు ఉండటం గమనార్హం. 2019 నుంచి 2024 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లపై సిట్‌ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Tirumala | గతంలో జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి, మురళీకృష్ణ, అలాగే ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డి కూడా తాజా నిందితుల జాబితాలో ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుల సంఖ్య మొత్తం 35కి చేరింది. వీరిలో 10 మందిని ఇప్పటికే సిట్‌ అరెస్టు చేసింది. విచారణ మరింత వేగంగా కొనసాగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: జిల్లా అధ్యక్షుల ప్రక్రియపై చంద్రబాబు ఫోకస్..!

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>