టీమిండియా ఓటములపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) మరోసారి స్పందించారు. టెస్ట్ మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోవడంతో టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir)పై వెల్లువెత్తుతున్న విమర్శలను ఆయన ఖండించారు. మైదానంలో ఆడటం కోచ్ పని కాదని, అది ఆటగాళ్ల పని, బాధ్యత అని చెప్పారు. కేవలం జట్టును సిద్ధం చేస్తాడే తప్ప.. మైదానంలోకి దిగి ఆడడని అన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో కూడా టీమిండియా చెత్త ప్రదర్శన కనబరిచింది. తొలి మ్యాచ్‌ను 30 పరుగులతో ఓడిపోతే, రెండో టెస్ట్‌లో 408 పరుగుల తేడాతో అత్యంత ఘోరంగా ఓటమిపాలయింది. అంతకు ముందు న్యూజిల్యాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-3తో వైట్ వాష్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 1-3 తేడాతో ఇండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ టార్గెట్‌గా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దీనిపై తాజాగా గవాస్కర్ స్పందించారు.
‘‘గంభీర్ ఒక కోచ్. జట్టును సిద్ధం చేయడం అతడి పని. తనకున్న అనుభవంతో ఎలా ఆడాలి, బంతులను ఎలా ఎదుర్కోవాలని దిశానిర్దేశం మాత్రమే చేస్తాడు. మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే. గంభీర్ కోచింగ్ బాగోలేదని అంటున్నారు. అతని కోచింగ్‌లోనే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ, ఆసియా కప్‌ను గెలిచింది. అప్పుడు అతడిని వన్డే, టీ20లకు జీవితాంతం కోచ్‌గా ఉండాలని ఎవరైనా అన్నారా?’’ అని ప్రశ్నించారు. అలాంటప్పుడు టెస్ట్ సిరీస్ ఓడిపోయినప్పుడు మాత్రం గంభీర్‌ను తొలగించాలని ఎలా డిమాండ్ చేయగలరు? అని గవాస్కర్ నిలదీశారు. ఒక జట్టు సరిగా రాణించనప్పుడు మాత్రమే కోచ్‌ను బాధ్యుడిని చేస్తారా? అని అన్నారు గవాస్కర్(Sunil Gavaskar).
Read Also: బాగా ఆడలేకపోయాం.. సారీ: రిషబ్ పంత్
Follow Us On : Youtube


