epaper
Monday, March 2, 2026
epaper

బాగా ఆడలేకపోయాం.. సారీ: రిషబ్ పంత్

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ పేలవమైన ప్రదర్శనపై టీమ్ తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) స్పందించాడు. తాము బాగా ఆడలేకపోయాం.. క్షమించండంటూ సారీ చెప్పాడు. తాము కచ్ఛితంగా తిరిగి పుంజుకుంటామని అన్నాడు. భారతీయులను సంతోష పెట్టాలని తమకూ ఉంటుందని వివరించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. రెండు మ్యాచ్‌లలో కూడా భారత ఆటగాళ్లు అత్యంత దారుణమైన ప్రదర్శన చేసి, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తొలి టెస్ట్ మధ్యలోనే మెడకు గాయం కారణంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. వెనుదిరిగాడు. దాంతో అతడి స్థానంలో జట్టు సారథ్య బాధ్యతలను రిషబ్ పంత్ చేపట్టాడు. అయినా టీమ్ ఆటతీరులో ఏమాత్రం మార్పు లేదు. రెండో టెస్ట్‌లో కూడా సఫారీ బ్యాటర్లను అదుపు చేయడంలో కానీ, దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో స్కోర్ చేయడంలో కూడా భారత్ రాణించలేకపోయింది. ఈ ఓటమికి తాను బాధ్యత తీసుకుంటూ రిషబ్ పంత్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో భారతీయులందరినీ క్షమాపణ కోరాడు.

‘‘గత రెండు వారాల్లో మేము బాగా ఆడలేకపోయాం అన్నది వాస్తవం. మేము ఎప్పుడూ కూడూ ఉత్తమమైన ప్రదర్శన చేసి భారతీయులను సంతోష పెట్టాలనే అనుకుంటాం. కానీ ఈ సారి అంచనాలను అందుకోలేకపోయాం. క్షమించండి’’ అని పంత్(Rishabh Pant) పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా జట్టు సామర్థ్యం గురించి తమకు తెలుసని, మరింత కష్టపడి లోపాలను సరిదిద్దుకుంటూ మళ్ళీ పుంజుకుంటామని చెప్పాడు.

Read Also: ఆన్‌లైన్ కంటెంట్ బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి: సుప్రీం

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!