సంగారెడ్డిలో ‘సండేస్ ఆన్ సైకిల్’.. ఉల్లాసంగా ఉత్సాహంగా సైక్లింగ్​

కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డిలో (Sangareddy) ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు సైకిళ్లు తొక్కి పర్యావరణ పరిరక్షణను గుర్తు చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా “సండేస్ ఆన్ సైకిల్” (Sundays on Cycle) కార్యక్రమం జరిగింది. ఆదివారం సంగారెడ్డిలో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు, అధ్యాపకులతోపాటు 1000 మందికిపైగా పాల్గొన్నారు. క్యాంపస్‌లో సైక్లింగ్‌తోపాటు వార్మ్-అప్ సెషన్లు, జుంబా, కమ్యూనిటీ కార్యకలాపాలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ఎంత ముఖ్యమన్నారు. హాఫ్ మారథాన్, సైక్లింగ్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఐఐటీ హైదరాబాద్‌ను అభినందించారు.

అనంతరం ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు సైక్లింగ్‌ను జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. ‘సండేస్ ఆన్ సైకిల్’ వంటి కార్యక్రమాలు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడటంతో పాటు ఫిట్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాయన్నారు.

Read Also: DMK మేనిఫెస్టో.. మహిళలకు నెలకు రూ. 2వేలు, స్టూడెంట్స్‌కు ల్యాప్‌టాప్‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>