వివాదాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. వ్యతిరేకత పెరుగుతున్నా తగ్గని వైనం

కలం, కరీంనగర్ బ్యూరోః  హుజూరాబాద్(Huzurabad) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయనను అసెంబ్లీ నుంచి సస్సెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం మరింత చర్చకు దారి తీసింది. కొంత కాలంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఉన్నతాధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి పలు కేసులతో వార్తల్లో నిలిచారు. అధికార పక్షం సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆయనను పూర్తిగా పదవిలో నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హుజూరాబాద్‌లో ఆయన వైఖరి మరింత వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రణయ్ బాబు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం కౌశిక్ రెడ్డికి అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి వివిధ అంశాలపై ఆయన తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. గతంలో పోలీస్ స్టేషన్ పేలుస్తానని బెదిరించిన ఘటన, గవర్నర్ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు, ఈటెల రాజేందర్‌పై విమర్శలు వంటి సంఘటనలు ఆయనపై విమర్శలు తెచ్చాయి. అసెంబ్లీలో కూడా ఆయన ప్రవర్తనపై ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల సమక్క-సారలమ్మ జాతర వద్ద పోలీసులతో వాగ్వాదం, కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీణవంక జాతర సమయంలో విధులకు ఆటంకం కలిగించారనే కేసులో విచారణ కూడా జరిగింది. మతపరమైన వ్యాఖ్యలపై కేసులు నమోదవడంతో ఆయన క్షమాపణలు తెలిపారు. ఇక చెక్ డ్యామ్ కూల్చివేత అంశంలో కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆయన వివాదంలో నిలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా బీఆర్‌ఎస్ పార్టీ ఆయనపై (Kaushik Reddy) గట్టిగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తాజాగా కాంగ్రెస్ డిమాండ్ మేరకు ఆయనపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Read Also: క్షమించండి.. ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంది: కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>