IPL 2026: టాస్ గెలిచిన ముంబై.. ఆ చెత్త రికార్డ్‌ చెరిగేనా?

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026(IPL 2026)లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (MI vs KKR) ఢీ కొంటున్నాయి. ఈ నేపథ్యంలో  టాస్ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది . ఈ ఐపీఎల్ టోర్నీలో తొలి మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా  ఇరు టీమ్ లు బరిలోకి దిగుతున్నాయి. మరి ఏ టీమ్ చివరకు విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

జట్లు ఇవే..

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(WK), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(C), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(C), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(WK), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ.

ముంబై చెత్త రికార్డు చెరిగేనా?

అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టు ముంబైని ఓ చెత్త రికార్డు గత 14 సంవత్సరాలుగా వేధిస్తోంది.అదే ఐపీఎల్ సీజన్ లో ఆడే ఫస్ట్ మ్యాచ్ లో ముంబై ఓడిపోవడం. ముంబై టీమ్ 2012లో తొలిసారి ఐపీఎల్ లోని మొదటి మ్యాచ్‌ను గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్ లోనూ తొలి మ్యాచ్ లో ఓటమితోనే టోర్నీని ప్రారంభిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ విజయం సాధించడం ద్వారా 14 ఏళ్ల చెత్త రికార్డును తుడిచివేయాలని హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.

కేకేఆర్ గండం గట్టేక్కేనా?

అటు ముంబైకి ఫస్ట్ మ్యాచ్ గండం ఉంటే, కేకేఆర్ కు వాంఖడే గండం ఉంది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలో కోల్‌కతా రికార్డు దారుణంగా ఉంది. ఇక్కడ ముంబైతో ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేకేఆర్ కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే గెలిచింది. అందులో ఒకటి 2012లో రాగా, రెండోది 2024లో దక్కింది. అంటే వాంఖడేలో ముంబైని కొట్టడం కేకేఆర్ (MI vs KKR) కు తలకు మించిన భారంగా మారుతోంది. అజింక రహానే నేతృత్వంలోని కేకేఆర్ టీమ్ ఈ రికార్డును బ్రేక్ చేసి.. ముంబైకి షాక్ ఇవ్వాలని చూస్తోంది.

Read Also: వింత ఘటన..పెళ్లి విందులో ‘లెగ్ పీస్’ కొట్లాట..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>