సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా ‘గోదారి గట్టుపైన’.. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్

కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’(Godari Gattupaina)..  మే 8న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. రూరల్ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్యూట్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించగా, నిధి ప్రదీప్ (Nidhi Pradeep) హీరోయిన్‌గా నటించింది. విలక్షణ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) కీలక పాత్రలో కనిపించనున్నారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ, ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు. మూడేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇది నాకు తొలి సినిమా లాంటిదే. ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండాలని అన్నారు. ‘మేము ఫేమస్’ తర్వాత పూర్తిగా భిన్నమైన కథతో వస్తున్నామని.. ‘గోదారి గట్టుపైన’ సినిమాలో లవ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పారు. ముఖ్యంగా జగపతి బాబు పాత్ర ఈ సినిమాలో హైలైట్ అవుతుందని, ఆయనను సాఫ్ట్ అండ్ క్యూట్ పాత్రలో చూడటం కొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.

గోదావరి యాసలో నటించడం తనకు ఛాలెంజింగ్‌గా  అనిపించిందని, దాదాపు నాలుగు నెలలు ప్రాక్టీస్ చేశానని తెలిపారు. ప్రేక్షకులు నిజమైన గోదారి యాసలా అనిపించేలా కృషి చేశానని అన్నారు. ఈ సినిమాలో తాను ఆటో డ్రైవర్ పాత్రలో కనిపిస్తానని, ఇది సాధారణ మాస్ పాత్ర కాకుండా ఫ్యామిలీకి విలువ ఇచ్చే ఇన్నోసెంట్ క్యారెక్టర్ అని చెప్పారు. సినిమాలో ఆటో రేస్ సీన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. దర్శకుడు సుభాష్ చంద్రపై పూర్తి నమ్మకం ఉంచి ఆయనకు పూర్తిగా సహకరించానని, సినిమా ప్రమోషన్స్ మాత్రం తన స్టైల్‌లో చేశానని నవ్వుతూ చెప్పారు. నిర్మాత అభినవ్ పూర్తి స్వేచ్ఛతో సినిమా తీశారని, రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరణ చేయడం సినిమాకు సహజత్వాన్ని తీసుకువచ్చిందని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ అందించిన సాంగ్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిందని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో  ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇక సినిమాకి సంబంధించిన ప్రమోషన్ వీడియోలు కూడా తానే రూపొందించానని, సమ్మర్‌కు తగ్గట్టు ‘కూల్’ కాన్సెప్ట్‌తో ప్రచారం చేశామని చెప్పారు. మొత్తానికి ‘గోదారి గట్టుపైన’ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ఎమోషన్స్‌తో నిండిన క్యూట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>