ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ !

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ సమరంలో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ , పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి. 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం యాజమాన్యం హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ (Hyderabad Traffic) అడ్వైజరీ జారీ చేసింది.

ఈ సందర్భంగా మ్యాచ్ రోజులో మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా నాగోల్–హబ్సిగూడ మార్గం (ఉప్పల్ జంక్షన్ ద్వారా), బోడుప్పల్–అంబర్‌పేట్ మార్గం (రామంతాపూర్ ద్వారా) వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని తేల్చింది. ఈ మార్గాలను అత్యవసర పరిస్థితులు తప్పితే ప్రయాణికులు తప్పుకోవాలని సూచించింది.

మరోవైపు హెవీ వాహనాలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయబడినవని, దయచేసి సూచనలు పాటించాలని తెలిపింది. ప్రజలు ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్టేడియం వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాట చేసినట్లు వెల్లడించింది. అయితే పాస్ లోని వాహనాలకు లోపలకి ప్రవేశం లేదని తేల్చి చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ కు వచ్చే వీక్షకులు ముందస్తుగా ప్రణాళిక చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>