కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ టాలీవుడ్ నటి సురేఖవాణి సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఒక పర్సనల్ వీడియో సర్క్యులేట్ కావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీనిపై స్పందించిన సురేఖవాణి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన నోట్‌ను పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, తన వ్యక్తిగత కంటెంట్ తన సమ్మతి లేకుండా సర్క్యులేట్ అవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు వ్యక్తులు ఎవరైనా సరే ఈ కంటెంట్‌ను షేర్ చేయడం, రీపోస్ట్ చేయడం లేదా సర్క్యులేట్ చేయడం వెంటనే ఆపేయాలని ఆమె కోరారు. తన పర్సనల్ కంటెంట్‌ను ఎవరైనా షేర్ చేస్తే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యూస్, రీచ్ లేదా పబ్లిసిటీ కోసం ఈ పరిస్థితిని దుర్వినియోగం చేయవద్దని, తన గోప్యతను గౌరవించాలని సురేఖవాణి విజ్ఞప్తి చేశారు. ఇది చాలా సీరియస్ మేటర్ అని, చట్టపరమైన చర్యలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.

