వైసీపీకి బిగ్ షాక్.. వైఎస్ జగన్ కంచుకోటలో టీడీపీ జెండా!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో అధికార కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ప్రతిపక్ష పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పులివెందుల జెడ్పీటీసీ (Pulivendula ZPTC) స్థానంలో టీడీపీ అభ్యర్థి భారతి ఘన విజయం సాధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన లెక్కింపులో వైసీపీ అభ్యర్థి సావిత్రిపై భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. వైసీపీకి పట్టున్న కంచుకోటగా భావించే పులివెందులలో కూటమి గెలుపొందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరహాలోనే, ఈ ఎన్నికల్లోనూ ఫలితాలు ప్రతికూలంగా రావడంతో పులివెందులలో వైసీపీ పట్టు క్రమంగా బీటలు వారుతోందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఏకగ్రీవాలు , కౌంటింగ్ ఆధిక్యాలను కలుపుకొని కూటమి అభ్యర్థులు ఏకంగా 355కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా, వైసీపీ కేవలం 24 స్థానాలకే పరిమితమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>