కరీంనగర్ లో కల్లోలం సృష్టిస్తే ఊరుకోం: సుడా చైర్మన్

కలం, కరీంనగర్ బ్యూరో : బీజేపీ, బీఆర్ఎస్ చీకట్లో రహస్య ఒప్పందాలు చేసుకొని ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని సుడా చైర్మన్ ( SUDA Chairman) కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల జరిగిన మేయర్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకున్నాయని అన్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ పరస్పరం దాడులు చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను బద్నాం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడితే బుద్ధి చెప్తామని, సిగ్గు లేకుండా కేటీఆర్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మారితే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని ప్రజాపాలనను చూసి ఓర్వలేక పోతున్నారని, తాము తలుచుకుంటే కేటీఆర్ ను బయట తిరగనివ్వమని అన్నారు.

పథకం ప్రకారమే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేసే నాటకాలు ఆడుతున్నాయని, కరీంనగర్ లో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నాయని తెలిపారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న నేతలంతా డ్రగ్స్ పైన జుట్టు పైన మచ్చలపైన మాట్లాడుకుంటూ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తలుచుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతల వ్యవహారాలన్నీ బయటపెడతామని అన్నారు. జువెలరీ షాప్ లో జరిగిన రాబరీ విషయంపై పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు ప్రారంభించారని, కౌశిక్ రెడ్డి కోడుగుడ్డు మీద ఈకలు పీకటం మానుకోవాలని అన్నారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ స్నేహితుల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికాయని.. ఆ మత్తులో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ ఇప్పించాలని ఎద్దేవా చేశారు. కేటీఆర్ మాటలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని.. మత్తులో ఏదేదో మాట్లాడుతున్నారని, పదవి అధికారం పోయిన తరువాత అక్రోషం ఎక్కువైందని తెలిపారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ డ్రగ్స్ తీసుకుని వ్యాధి ముదిరినట్లు బిహేవ్ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు మల్లెపల్లి బుచ్చిరెడ్డి,సరిల్ల ప్రసాద్,టేల భూమయ్య,గంటా శ్రీనివాస్,జగన్ రెడ్డి,పర్వతాల మల్లేశం,వారాల నర్సింగం,మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,ఉప్పరి అజయ్,మాసూమ్ ఖాన్, అష్రఫ్, బషీర్, కలీల్, జమీల్, షహన్షా, ఎండీ అనిఫ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>