పెండల్దరిరో ఆదివాసీ దినోత్సవ వారోత్సవాలు

కలం, నిర్మల్ : ఆదివాసులపై అటవీ అధికారులు వేధింపులకు పాల్పడటం మానుకోవాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసం శంభు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ (Sarangapur) మండలంలోని పెండల్దరి గ్రామంలో జెండా ఆవిష్కరించి మాట్లాడారు.

గాపూర్ – పెండల్దరి గ్రామాల మధ్య ఉన్న రెండు కిలోమీటర్ల రహదారిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండల్దరి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీడం గంగారాం, సీడం భీంరావ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>