హనుమాన్ మాలలో విద్యార్థులు.. అనుమతించని స్కూల్ యాజమాన్యం!

క‌లం, వెబ్ డెస్క్‌: హ‌నుమాన్ దీక్ష (Hanuman Deeksha)లో ఉన్న విద్యార్థుల‌ను ఓ పాఠ‌శాల యాజ‌మాన్యం లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. జగిత్యాల (Jagtial)జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని మెట్‌పల్లిలో ఉన్న‌ నిఖిల్ భారత్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు హ‌నుమాన్ దీక్ష‌లో ఉన్నారు. మాల ధ‌రించిన కార‌ణంగా నిబంధనల పేరుతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. 21 రోజుల పాటు స్కూల్‌కు రావద్దని విద్యార్థులకు తేల్చి చెప్పారు.

విద్యార్థులు ఇంటికి వెళ్లి విష‌యం చెప్ప‌డంతో భారీ ఎత్తున స్వాములు పాఠశాలకు చేరుకొని ఆందోళ‌న చేప‌ట్టారు. పాఠ‌శాల‌లో జై శ్రీరాం నినాదాలు చేశారు. యాజ‌మాన్యం తీరుపై స్వాములు మండిప‌డుతున్నారు. మ‌రో వైపు విద్యార్థులు త‌మ‌తో బ‌ల‌వంతంగా 21 రోజుల లీవ్ లెట‌ర్ రాయించుకున్నార‌ని, గుడిలోనే భ‌జ‌న‌లు చేసుకోండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడార‌ని ఆరోపిస్తున్నారు. మాల తీసేస్తేనే బ‌డికి రావాల‌ని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>