క్లాస్ రూంలో స్టూడెంట్‌కు ప్ర‌పోజ్ చేసిన ప్రొఫెస‌ర్‌.. త‌ర్వాత ఏమైందంటే?

క‌లం, వెబ్ డెస్క్‌: ఆయ‌న ఒక ప్రొఫెస‌ర్‌ (Professor).. విద్యార్థుల‌కు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన‌ బాధ్య‌త ఆయ‌న‌ది.. కానీ, క్లాస్‌రూంలో చ‌దువు పాఠాల‌కు బ‌దులు ప్రేమ పాఠాలు మొద‌లుపెట్టాడు. ఏకంగా త‌ర‌గ‌తి గ‌దిలో అందరి ముందే ఓ విద్యార్థినికి ల‌వ్ ప్ర‌పోజ్‌ (Love Proposal) చేశాడు. ఒక్క‌సారిగా విద్యార్థులంతా షాక‌య్యారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరు (Bengaluru)లోని నీలమంగ‌ళ‌ (Nelamangala)లో చోటు చేసుకుంది. టి.బేగూరులోని ఓ మెడిక‌ల్ కాలేజీలో ఎప్ప‌టిలాగానే క్లాస్ న‌డుస్తోంది. పాఠం చెప్పాల్సిన ప్రొఫెస‌ర్ అబ్దుల్ మైక్‌లో ఓ విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ ప్ర‌క‌టించాడు. స‌ద‌రు యువ‌తి అక్క‌డే అబ్దుల్‌ను నిల‌దీసింది. అత‌డు త‌ర్వాత మాట్లాడ‌తానంటూ అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడు.

కాలేజ్ అయిపోయిన తర్వాత‌ తోటి విద్యార్థుల‌తో కలిసి స‌ద‌రు యువ‌తి ప్రొఫెస‌ర్ అబ్దుల్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పింది. ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రొఫెసర్‌ను అడ్డుకొని విద్యార్థులంతా దేహశద్ధి చేశారు. బాధిత యువ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప్రొఫెస‌ర్‌ను చెప్పుతో కొట్టింది. విద్యార్థుల దాడికి బెదిరిపోయిన‌ ప్రొఫెస‌ర్ అక్క‌డి నుంచి అతి క‌ష్టం మీద త‌ప్పించుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై నీల‌మంగ‌ళ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులు ప్రొఫెస‌ర్‌పై దాడి చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>