కలం, వెబ్ డెస్క్ : దర్శకుడు ఆదిత్య ధర్ – రణవీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్'( Dhurandhar 2) చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో ‘ధురందర్ 2’ జోరు కనబరుస్తోంది. ఈ మూవీ ఏడురోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.1,000 కోట్లు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా ఇండియా నుంచే రూ. 745 కోట్లు కొల్లగొట్టగా.. ఓవర్సీస్ లో రూ. 265 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ.1,010 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు తేలింది.
‘ధురందర్ 2’ సరికొత్త చరిత్ర..
అంతేకాదు రిలీజైన వారంలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన రెండవ ఇండియన్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పొంది. ‘పుష్ప 2’ మూవీ ఏడు రోజుల్లోనే ఏకంగా రూ. 1067 కోట్లు వసూలు చేసింది. నిజానికి ‘దురంధర్ 2’ కలెక్షన్స్ ‘పుష్ప 2’ కంటే వెనుకపడటానికి రెండు కారణాలున్నాయి. రీజినల్ లాంగ్వేజెస్ లో ‘ధురందర్ 2’ రోజులు ఆలస్యంగా రిలీజ్ అయింది. గల్ఫ్ కంట్రీస్ లో ఈ మూవీ రిలీజ్ పై నిషేధం విధించబడింది. దీంతో భారతీయ హిందీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్న దేశాల్లో ఈ మూవీ రిలీజ్ కాలేదు. అందువల్ల ‘దురంధర్ 2’ మూవీ ‘పుష్ప 2’ కు కొద్ది దూరంలో ఆగిపోయింది.
భారీ కలెక్షన్ల దిశగా ‘ధురందర్ 2’..
మొత్తం వసూళ్ల పరంగా ‘పుష్ప 2’ మూవీ రూ. 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. మొత్తం వసూళ్ల పరంగా ‘పుష్ప 2’ రికార్డును ‘ధురందర్ 2’ బద్దలు కొడుతుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ బరిలో రూ. 2024 కోట్లతో ఆమీర్ ఖాన్ దంగల్ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో బహుబలి 2 ( రూ.1810 కోట్లు), పుష్ప 2 (రూ.1800 కోట్లు), ధురందర్ (రూ.1400 కోట్లు), RRR (రూ.1387 కోట్లు), KGF చాప్టర్ 2 (రూ.1250కోట్లు), జవాన్ ( రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు), కల్కి 2898 ఏడి ( రూ.1100 కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు ‘ధురందర్ 2’ సైతం రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రానున్న రోజుల్లో కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

