కలం డెస్క్ : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల (Panchayat Elections) మొదటి దశ పోలింగ్ గురువారం జరగనున్నది. సుమారు 50 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అదనపు ఫోర్స్ కూడా ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నమైంది. మొత్తం 3,834 పంచాయతీల సర్పంచ్ పోస్టులకు, వాటి పరిధిలోని 27,628 వార్డు సభ్యుల ఎన్నికకు గురువారం పోలింగ్ జరుగుతుంది. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సర్పంచ్ పోస్టులకు 12,960 మంది, వార్డు సభ్యుల పోస్టులకు 65,455 మంది పోటీ పడుతున్నారు. ఇందుకోసం 45,086 బ్యాలట్ బాక్సులను కమిషన్ వినియోగిస్తున్నది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్‌లో మొత్తం 27,41,070 మంది పురుష ఓటర్లు ఉంటే 28,78,159 మంది మహిళలు ఉన్నారు.
పది వేల మంది అభ్యర్థులు ఏకగ్రీవం :
మొత్తం 4,236 గ్రామ పంచాయతీల సర్పంచ్ పోస్టులకు ఎన్నికలు (Panchayat Elections) జరగాల్సి ఉండేలా నోటిఫికేషన్ జారీ చేసినా ఐదు చోట్ల నామినేషన్లే దాఖలు కాలేదు. మరో చోట పోలింగ్ ప్రక్రియను స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిలిపేసింది. వివిధ జిల్లాల్లో 396 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో పోలింగ్ జరగాల్సిన అవసరం లేకుండాపోయింది. దీంతో 3,834 సర్పంచ్ పోస్టులకే పోలింగ్ జరుగుతుంది. వార్డు సభ్యుల విషయంలో మొత్తం 37,440 పోస్టులకుగాను 169 చోట్ల నామినేషన్లే దాఖలు కాలేదు. కేవలం ఒకే నామినేషన్ దాఖలు కావడంతో 9,633 పోస్టులు ఏకగ్రీవమయ్యాయి. మరో పది చోట్ల పోలింగ్ ప్రక్రియను కమిషన్ నిలిపేసింది. దీంతో చివరకు 27,628 వార్డు సభ్యుల పోస్టులకే పోలింగ్ జరగనున్నది.
Read Also: రెండేండ్లలో సీఎంఆర్ఎఫ్ స్కీమ్‌కింద అందిన సాయం
Follow Us On: Youtube


