వీధికుక్కల(Stray Dogs Attack) బెడద రోజురోజుకు అధికమవుతోంది. వాటి కారణంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాలంటేనే భయమేస్తోంది. తాజాగా వరంగల్(Warangal)లో ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. జిల్లా కేంద్రం న్యూషాయంపేటలో ఓ చిన్నారి.. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడున్న ఓ వ్యక్తి స్పందించి వీధికుక్కలకు బెదరగొట్టాడు. దీంతో కుక్కలు అక్కడి నుంచి పరారయ్యాయి. అయితే వీధికుక్కల అంశంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు చర్యలు తీసుకొంటున్నారని, అవి కూడా నామమాత్రంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెలా ఉంటే ఇటీవల నిజామాబాద్‌లో కూడా 10ఏళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి.
వీధికుక్కల(Stray Dogs Attack) దాడిలో గాయపడిన లక్షణ(10) ఆదివారం మరణించింది. తనపై వీధికుక్కల దాడిని ఇంట్లోవారికి భయపడి చెప్పని లక్షణ.. మూడు రోజుల క్రితం వింతగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు లక్షణకు రేబిస్ సోకినట్లు వెల్లడించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్షణ మృతి చెందింది. దీంతో వీధి కుక్కల అంశంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యలకు పరిష్కారం చూపాలి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: 71 మంది మావోయిస్ట్‌లు లొంగుబాటు..

