epaper
Tuesday, November 18, 2025
epaper

‘అవకాశం, అధికారం, ఆత్మగౌరవమే మా విధానం’

తెలంగాణ జాగృతి విధానాలను కవిత(Kavitha) స్పష్టం చేశారు. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం మా విధానం అని తేల్చి చెప్పారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత.. నిజామాబాద్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగానే తమకు రాజకీయ పదవుల కన్నా ప్రజల సమస్యలు తీరడం ముఖ్యమని పేర్కొన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ మంచి జరగాలనే జనం బాట(Janam Bata) చేపట్టామన్నారు. రాజకీయ పార్టీ అవసరమైతే పెడతామని చెప్పారు. ‘‘నిజామాబాద్ లో నన్ను ఎమ్మెల్యేలే ఓడించారు. నన్ను బయటికి పంపి పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్‌కి లేదు. అలాంటిది ఉంటే మీడియా ముందు ఆయనే చెబుతారు. కేసీఆర్‌ని, బీఆర్ఎస్‌ను ఇష్యూ బేస్డ్ గానే విమర్శిస్తాను’’ అని తెలిపారు.

‘‘కాంగ్రెస్ ది మునిగిపోయే నావ. వారు నాకు మద్దతు ఇవ్వటమేంటీ? మనం ఎన్నో విప్లవాలను చూశాం. వాటిలో కొన్ని మాత్రమే గమ్యాన్ని ముద్దాడాయి. దానిలో స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన ఫ్రెంచ్ ఉద్యమం సక్సెస్ అయ్యింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యింది. జాగృతి జనం బాట ఎందుకంటే? అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే విధానం మాది. ఇది అర్థం కాని కాన్సెప్ట్ ఏమీ కాదు. ఇప్పుడు విద్య అందరికీ అందుబాటులో లేదు. ఫీజు రీ యింబర్స్ మెంట్ ఇస్తలేరు. దాంతో నష్టపోయేది ఎవరు? ఆడబిడ్డలు మాత్రమే’’ అని అన్నారు.

‘‘ఫీజు కట్టాల్సి వస్తే తల్లిదండ్రులు మగ పిల్లలకు ఫీజు ఇస్తారు. ఆడ వాళ్లకు ఇవ్వరు. ఈ విధంగా ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వమే అణిచి వేస్తోంది. అదే విధంగా అధికారంలో వాటా. ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ అధికారంలో వాటా కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం జరగాల్సిందే. అధికారంలో మహిళల వాటా 5 శాతం కూడా లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు భాగస్వామ్యం లేదు’’ అని చెప్పారు.

‘‘అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరముంది. మైనార్టీల పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, మైనార్టీ మంత్రి లేని మొట్ట మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. మైనార్టీ, ఎస్టీ మంత్రి లేని ప్రభుత్వం. కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలి. అందరికీ సమాన అవకాశాలు రావాలంటే అందరినీ కలుపుకొని పోవాలి. ఇక ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ది. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి పెట్టింది పేరు. అవకాశం, అధికారం ఉన్నప్పుడు మాత్రమే ఆత్మగౌరవం వస్తుంది. నేను ఒక్క బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసమే మాట్లాడటం లేదు.. తెలంగాణలోని అందరి కోసం మాట్లాడుతున్న’’ అని Kavitha తెలిపారు.

Read Also: వీధి కుక్కల వీరవిహారం.. మొన్న నిజామాబాద్.. నేడు వరంగల్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>