కలం, నిజామాబాద్ బ్యూరో : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) రాముని గురించి మాట్లాడటం మానుకోవాలని నిజామాబాద్(Nizamabad) నగర బీజేపీ ఎమ్మెల్యే దనపాల్ సూర్యనారాయణ గుప్తా (Suryanarayana Gupta) హెచ్చరించారు. నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రాముడి ఆశీర్వాదంతోనే ప్రపంచంలో బీజేపీకి అత్యధిక మెంబర్షిప్, దేశంలో 21 రాష్ట్రాలలో అధికారంలో ఉందన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) గద్దె కోసం కేవలం హిందూ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తర్వాత విమర్శించడం ముమ్మాటికి తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ దేవతలు అలవోకగా దొరికారా హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
రెండున్నరేళ్లలో అభివృద్ధి చేయని కాంగ్రెస్‌కు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ బరాబర్ ఇందూరేనని, కార్పొరేషన్ గెలుచుకోగానే పేరును మార్చే ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పిస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, పోతంకర్ లక్ష్మి నారాయణ, బీజేపీ జిల్లా కార్యదర్శి జోతి, బీజేపీ నాయకులు న్యాలం రాజు, ప్రమోద్, ప్రభాకర్, తారక్ వేణు, ఇప్పకాయల కిషోర్, బట్టు రాఘవేందర్, మల్లేష్ యాదవ్, పుట్ట వీరేందర్, హరీష్ రెడ్డి, కార్తీక్, మధు,భాస్కర్, విజయ్, వినోద్, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

Read Also: కొత్త పింఛన్లపై త్వరలోనే నిర్ణయం : మంత్రి శ్రీధర్ బాబు
Follow Us On: Sharechat


