Mobile Popup Ad
Mobile Popup Ad

ఆగని దారుణాలు.. రెచ్చిపోతున్న మృగాళ్లు!

కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal Crime)లో ఆమెకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. మానవత్వం మరిచిన మృగాళ్లు దారుణాలకు దిగుతున్నారు. చిన్నారుల పై లైంగిక దాడులు, ఒంటరి మహిళల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారంటూ బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని కేసులు వెలుగులోకి రావడం లేదు. చట్టాలెన్ని చేసినా, కఠిన శిక్షలు వేసిన నేరాల సంఖ్య మాత్రం తగ్గడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆమెకు రక్షణేదీ?

ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట ఫలానా దారుణం (Crime) చోటుచేసుకుందనే వార్తలు వింటూనే ఉన్నాం. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట జనగామ జిల్లా బచ్చన్నపేటలో మైనర్ బాలికను బీఆర్ఎస్ లీడర్ పెళ్లి చేసుకోవడం కలకలం రేపింది. డబ్బుల కోసం ఆశపడిన బాలిక తల్లిదండ్రులు తన కంటే 30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికిచ్చి పెళ్లి చేసుకున్నారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు హైదరాబాద్ లో మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నాలుగు రోజుల కిందట వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మి పురం గ్రామానికి చెందిన మహిళ ప్రియుడి చేతిలో దారుణంగా చంపబడింది.

నెలరోజుల క్రితం హనుమకొండ జిల్లా ఐనవోల్ మండలానికి చెందిన వ్యక్తి తన భార్యకు వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారంటూ దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలను స్విమ్మింగ్ పూల్ లో ముంచి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఇద్దరు మృగాళ్లు ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్లు కొనిస్తామని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తాజాగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికీ చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

భయపెడుతున్న హత్యలు

వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ తరహా 4 హత్యలు నమోదయ్యాయి. కాజీపేటలో కట్టుకున్న భర్తను భార్య, ప్రియుడు కలిసి హత్య చేశారు. గత మార్చి లో వర్ధన్నపేటలో అనుమానంతో భార్యను భర్త గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. ఏప్రిల్ లో హనుమకొండ హంటర్ రోడ్‌లో ప్రియురాలిని చంపిన ప్రియుడు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ నెలలోనే భూపాలపల్లిలో తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటావా అని ఓ ప్రేమోన్మాది యువతిని హత్య చేశాడు. అయితే ఇలాంటి కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్న నేరాలు మాత్రం ఆగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Read Also: వైభవ్ సూర్యవంశీకి ఇండియా-ఏ ఛాన్స్.. ఐపీఎల్‌లో భారీ అంచనాలు

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>