epaper
Friday, January 16, 2026
spot_img
epaper

స్టార్టప్​ ఇండియా ఒక విప్లవం: ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: దేశ అభివృద్ధి పథంలో ‘స్టార్టప్​ ఇండియా’ ఒక విప్లవంలా మారిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, తద్వారా  మరికొంత మందికి ఉపాధి లభించేలా చేయడం కోసం కేంద్రంలోని ఎన్​డీఏ ప్రభుత్వం ‘స్టార్టప్​ ఇండియా’ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విశిష్ట పథకానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వివిధ ఆవిష్కరణలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు.

ప్రస్తుతం భారత్​ ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్​ ఎకోసిస్టమ్​గా ఎదిగిందని ప్రధాని మోదీ అన్నారు. దీనికి కారణం స్టార్టప్​ ఇండియా ప్రోగ్రామ్ (Startup India)​ అని పేర్కొన్నారు. 2014లో కేవలం 4 స్టార్టప్​లతో ప్రారంభమైన స్టార్టప్​ ఇండియాలో ప్రస్తుతం 2లక్షల స్టార్టప్​లు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 125కు పైగా యూనికార్న్​​లు ఉన్నాయన్నారు. ఇవి ఐపీవోలను ప్రారంభించి వేలాది ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. టైర్​–2, టైర్​–3  నగరాల్లోని యువతతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు సైతం స్టార్టప్​ ఇండియా ద్వారా స్వయం సమృద్ధి సాధిస్తుండడం గర్వకారణమన్నారు.

స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్​ మహిళల అభున్నతిలోనూ తన వంతు పాత్ర పోషిస్తోందని ప్రధాని అన్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్టప్​లలో దాదాపు 45 శాతం వరకు కనీసం ఒక మహిళా డైరెక్టర్​  లేదా మహిళా భాగస్వామి ఉండడం దీనికి నిదర్శమని చెప్పారు. భద్రమైన భవిష్యత్తు కోసం రిస్క్​ తీసుకునే ధోరణి భారతీయ యువతలో పెరిగిందని ఆయన కొనియాడారు. భారతీయ స్టార్టప్​ల ఫౌండర్స్​ ఆత్మవిశ్వాసం, ఆశయాలు అభినందనీయమని ప్రశంసించారు. ‘భారతీయ యువత ఒక గీత గీసుకొని అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలని కోరుకోవడం లేదు. సౌకర్యవంతమైన పరిధిలో పనిచేయాలని అనుకోవడం లేదు. రిస్క్​ తీసుకుంటున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు’ అని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు.

Read Also: దాయాదులు ఒక్కటైనా.. దక్కని ఫలితం!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>