కోడిపుంజు, కత్తితో దివ్వెల మాధురి.. నయా గెటప్..

కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే దివ్వెల మాధురి (Madhuri) సంక్రాంతి వేళ మరో వీడియో వదిలింది. తలపాగా చుట్టుకుని.. ఓ చేతిలో కోడిపుంజు, ఇంకో చేతిలో పెద్ద కత్తి పట్టుకుని తెగ హల్ చల్ చేస్తోంది. అలా అని కోళ్ల పందేలకు వెళ్తుందేమో అనుకోకండి. ఆమె ఇంటి వద్దే ఈ వీడియో చేసింది. కోడి పుంజును నిమురుతూ పందేలకు సై అన్నట్టు ఫోజులు ఇచ్చేసింది మాధురి (Madhuri). సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. ట్రెండ్ కు తగ్గట్టు వీడియోలు చేయడం మాధురికి అలవాటే కాబట్టి.. ఈ వీడియోతో మళ్లీ అటెన్షన్ లోకి వచ్చేసిందన్నమాట. ఈ వీడియో చూసిన కొందరు.. కొంపదీసి కోడిపుంజును ఏసేసిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో కోళ్ల పందేలకు ఏమైనా వస్తున్నావా అంటున్నారు. మొత్తానికి ఒక్క వీడియోతో మాధురి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>