కలం, వెబ్ డెస్క్ : నైజీరియాలో (Nigeria) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ఆంథోని జోషువా (Anthony Joshua ) కు స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒగున్ రాష్ట్రంలోని మకున్ ప్రాంతంలో, లాగోస్–ఇబాడన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. జోషువ వెనుక సీటులో కూర్చున్నారని, ఆయనకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని పోలీసులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణమని అధికారులు చెబుతున్నారు. జోషువా ఉన్న కార్ ఓవర్ స్పీడ్‌తో కంట్రోల్ తప్పి ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు చెబుతున్నారు.
ఫొటోల ప్రకారం ఆయన క్షేమంగానే ఉన్నట్లు భావిస్తున్నట్టు జోషువా సన్నిహితులు తెలిపారు. ఇటీవలి కాలంలో, జోషువ (Anthony Joshua )అమెరికాలోని మయామిలో, నెట్‌ఫ్లిక్స్ మద్దతుతో జరిగిన బౌట్‌లో యూట్యూబర్ నుండి బాక్సర్‌గా మారిన జేక్ పాల్‌ను నాకౌట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే జోషువ, మాజీ ప్రపంచ ఛాంపియన్ టైసన్ ఫ్యూరీతో పోరుకు సిద్ధమవుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు, జోషువ సెప్టెంబర్‌లో బ్రిటిష్ బాక్సర్ డేనియల్ డుబాయిస్ చేత ఐదో రౌండ్ నాకౌట్ ఓటమి ఎదుర్కొన్నాడు.
Read Also: జర్మనీలో మనీహీస్ట్.. రూ.315కోట్ల భారీ దోపిడీ
Follow Us On: Pinterest


