epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జర్మనీలో మనీహీస్ట్​.. రూ.315కోట్ల భారీ దోపిడీ

కలం, వెబ్​డెస్క్​: అచ్చం మనీహీస్ట్​ (Money heist) సినిమాను తలపించే ఓ భారీ దోపిడీ (Bank Robbery) జర్మనీ (Germany) లో జరిగింది. గోడలకు డ్రిల్స్​ చేసి, వాల్ట్​లు బద్దలుకొట్టి ఒకటీ రెండూ కాదు ఏకంగా 35 మిలియన్​ డాలర్లు (రూ.315కోట్లు) నగదును దొంగలు దోచుకెళ్లారు. క్యాష్​తోపాటు నగలు, వజ్రాలు, బంగారం, వెండి కూడా పట్టుకెళ్లారు. వీటి విలువ లెక్కించాల్సి ఉంది. జర్మనీలోని జెల్సెన్​కిష్షెన్​​ నగరంలో ఉన్న ఓ బ్యాంకులో ఈ దోపిడీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున బ్యాంకులో ఫైర్​ అలారం మోగడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని దోపిడీ విషయం గుర్తించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. డ్రిల్లింగ్​ సమయంలో ఏర్పడే వేడి, ధూళి కారణంగా అలారం మోగుతుందని ముందే అంచనా వేసిన దుండగులు, దాన్ని అడ్డుకునేందుకు నీటిని పిచికారి చేసినట్లు గుర్తించారు. బ్యాంకుకు సమీపంలోని పార్కింగ్​ స్థలానికి చెందిన దిగువ అంతస్థులో ఓ సొరంగం(టన్నెల్​) ఉంది. దాని ద్వారా బ్యాంకు బేస్​మెంట్​కు చేరుకున్న దుండగులు, అక్కడి నుంచి గోడలను డ్రిల్​చేశారు. నగదు బాక్స్​లు, లాకర్లు ఉంచే గదికి చేరుకొని, వాటిని తెరిచి సొమ్ముతో పరారయ్యారు.

దోపిడీ (Bank Robbery) జరిగిన తీరు చూస్తే ఆరితేరిన దొంగలు పక్కా ప్రణాళికతో, టెక్నాలజీని వాడుకొని చేసినట్లు ఉందని పోలీసులు అంటున్నారు. డ్రిల్​ కోసం వాడిన పరికరాలు సాధారణ హార్డ్​వేర్​ దుకాణాల్లో దొరకవని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, జర్మనీలో క్రిస్మస్​కు 24,25,26 తేదీలల్లో సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత 27, 28 వీకెండ్​ కావడంతో మొత్తం ఐదు రోజుల పాటు బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు మూసి ఉన్నాయి. ఈ అవకాశాన్ని దుండగులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>