Mobile Popup Ad
Mobile Popup Ad

మూగ జీవాల‌ ప్రాణాలు తీస్తున్న విద్యుత్ తీగలు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చర్ల మండలంలోని సీ కత్తిగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం మేతకు వెళ్లిన మూడు పాడి గేదెలు విద్యుదాఘాతానికి గురై చ‌నిపోయాయి. సీ కత్తి గూడెం గ్రామవాసి వెంబడి హరినాథ్‌కు చెందిన పాడి గేదెలు అకాల మరణం చెందటంతో, కుటుంబం జీవనాధారం కోల్పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, హరినాథ్ మాట్లాడుతూ.. “నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయి. ఆ విషయం తెలియక మేతకు వెళ్లిన మా పశువులు మృత్యువాత పడ్డాయి. సుమారు 3.6 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మా కుటుంబానికి ఉన్న ఏకైక ఆధారం కోల్పోయాము,” అని బాధితుడు హరినాథ్ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి, బాధిత రైతుకు తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Also: భక్తులకు డబ్బు ప్రసాదంగా ఇచ్చే ఆలయం.. ఎక్కడో తెలుసా!

Follow Us On: WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>