తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్(KCR)కు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్(Srisailam Yadav) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన జోలికి రావొద్దని హెచ్చరించారు. తన జోలికి వస్తే కేసీఆర్ చరిత్ర అంతా బయటకు తీస్తానని అన్నారు. ‘‘నేను నోరు తెరిస్తే కేసీఆర్ బట్టలు విప్పుతా. నన్ను మాట్లాడొద్దు అన్నారు కాబట్టి ఊరుకున్నా.. నా గురించి తీస్తే కేసీఆర్ రకరకాల చరిత్ర తీస్తా. నన్ను రౌడీ షీటర్ అంటావా.. ఎక్కువ మాట్లాడొద్దు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ తన టికెట్‌ను రౌడీషీటర్ ఫ్యామిలీకి ఇచ్చిందని కేసీఆర్ అన్నారు. ఆ వ్యాఖ్యలకు బదులుగానే శ్రీశైలం యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: మరోసారి ఢిల్లీకి రేవంత్.. ఈసారి ఎందుకంటే..

