కలం, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 50% సబ్ కోట కేటాయించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. హైద్రాబాద్ కాచిగూడ లోని హోటల్ అభినందన్ గ్రాండ్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో “మహిళ బిల్లులో – బీసీ మహిళలకు సబ్ కోట” పేరుతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ వి హనుమంత్ రావు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మాజీ మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల శ్రీనివాస్, కురుమ శ్యామ్, విక్రమ్ గౌడ్, మహేష్ యాదవ్, గణేష్ చారీ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లులోని 33% మహిళా కోటాలో 50% బీసీ మహిళలకు (BC Women) కేటాయించాని అన్నారు. మొత్తం సీట్లలో సుమారు 16.5% బీసీ మహిళల సబ్ కోటా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సబ్ కోటా అమలు చేయకపోతే అగ్రవర్ణ మహిళలు మాత్రమే లాభపడి, బీసీ మహిళలు మరింత వెనుకబడి నష్టపోయే అవకాశం ఉందన్నారు. తెలంగాణ జనాభాలో సుమారు 50-52% బీసీలు ఉన్నప్పటికీ, చట్టసభల్లో బీసీ మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు జరిగినప్పుడు, బీసీ మహిళలకు న్యాయమైన వాటా పొందాలంటే సబ్ కోటా తప్పనిసరి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని అన్నారు. జనగణనలో ఎస్సీ, ఎస్టీల కుటుంబాల మాదిరిగానే బీసీల కుటుంబాలను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు.
Read Also: కేరళ సీఎం విజయన్‌కు సీఎం రేవంత్ రెడ్డి సంచలన లేఖ
Follow Us On: Instagram

