Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. వరల్డ్‌కప్‌కు మిడ్‌ఫీల్డర్ జోర్డాన్ దూరం!

కలం, స్పోర్ట్స్: మెక్సికోపై గెలిచిన ఆనందంలో ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ జోర్డాన్ హెండర్సన్ (Jordan Henderson) ఘోరంగా గాయపడ్డారు. దాంతో ఆయన ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో మెక్సికోపై ఇంగ్లాండ్ 3-2 తేడాతో గెలిచింది. మ్యాచ్ ముగిసిన వెంటనే 36 ఏళ్ల హెండర్సన్ సంబరాలు చేసుకున్నారు. స్టేడియంలోని అడ్వర్టైజింగ్ బోర్డులను దాటి అభిమానుల వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కాలు జారడంతో కింద పడిపోయారు. మణికట్టుపై తీవ్ర ఒత్తిడి పడటంతో పెద్ద గాయమైంది.

తోటి ఆటగాళ్లు, వైద్య సిబ్బంది వెంటనే ఆయన వద్దకు చేరుకున్నారు. మైదానంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హెండర్సన్‌కు ఆక్సిజన్ అందిస్తూ ఆసుపత్రికి తరలించారు. హెండర్సన్ చేయి తీవ్రంగా విరిగిందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి శస్త్రచికిత్స అవసరమవుతుందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై ఇంగ్లాండ్ హెడ్ కోచ్ థామస్ టుచెల్ విచారం వ్యక్తం చేశారు. హెండర్సన్ మణికట్టుకు తీవ్ర గాయమైందన్నారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు.

తదుపరి చికిత్స విధానంపై తనకు ఇంకా పూర్తి స్పష్టత లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హెండర్సన్ మెక్సికోలోనే ఉన్నారు. మిగిలిన జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం కాన్సాస్ సిటీకి తిరిగొచ్చింది. హెండర్సన్ ఈ టోర్నీలో పనామాపై జరిగిన మ్యాచ్‌లో కేవలం ఆరు నిమిషాలు మాత్రమే ఆడారు. అయినా జట్టులో ఆయన అనుభవం ఎంతో కీలకం. కాగా ఈ మ్యాచ్‌లో జూడ్ బెల్లింగ్‌హామ్ రెండు అద్భుతమైన గోల్స్ చేశారు.

1986లో డియెగో మారడోనా తర్వాత ఈ స్టేడియంలో ఒకే మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ ద్వారా గోల్ కొట్టారు. గ్యారీ లినేకర్ పేరిట ఉన్న ఆరు వరల్డ్ కప్ నాకౌట్ గోల్స్ రికార్డును సమం చేశారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ 11వ సారి వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>