ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న హీరోయిన్స్‌లో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) కూడా ఒకరు. కేజీఎఫ్‌తో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం అయిన శ్రీనిధి.. తొలి చిత్రం నుంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత వరుస హిట్‌లతో స్టార్ హీరోయిన్‌గా తన మార్క్ చూపించుకుంటుంది. అయితే తాజాగా అమ్మడు.. రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన శ్రీనిధి.. తనను తన ఫ్రెండ్స్ అంతా కూడా లేడీ ప్రభాస్(Lady Prabhas) అని పిలుస్తారని చెప్పింది. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయని వివరించింది.
‘‘ప్రభాస్(Prabhas).. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. పెద్దగా పోస్ట్‌లు పెట్టరు. నేను కూడా అంతే. సోషల్ మీడియా ఉంటుంది కానీ.. పోస్ట్‌లు పెట్టడం చాలా తక్కువ. అందుకే నా ఫ్రెండ్స్ అంతా నన్ను లేడీ ప్రభాస్ అంటారు. వాళ్లు అలా పిలవడం నాకు చాలా ఇష్టం. చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే అంత స్టార్‌తో నన్ను పోలుస్తున్నారు కదా. అందుకే వాళ్లు అలా అన్నప్రతిసారీ ఫుల్ ఖుష్ అవుతా. ఇక రెబల్ స్టార్‌ను ఎవరైనా పొగడాల్సిందే’’ అని శ్రీనిధి(Srinidhi Shetty) కామెంట్ చేసింది.

