షోయబ్ మాలిక్(Shoaib Malik).. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అతడు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్. అయితే కొంతకాలంగా అతడు తన పనితీరు, ఆటతోనే, ఎవరిపైన అయినా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వార్తల్లో నిలవడం లేదు. వరుస విడాకులు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. అవును.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యాడు షోయబ్ మాలిక్.
ఇండియా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను(Sania Mirza) పెళ్లి చేసుకోవడంతో.. మన ఇంటి అల్లుడు అని భారతీయులంతా అతడి విషయంలో అనేక సార్లు చూసీచూడకుండా వదిలేశారు. ఏమీ అనను కూడా అనలేదు. వీరిద్దరి వివాహం 2010లో జరిగింది. దాదాపు 14 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 2024లో వీరు విడిపోవాలని డిసైడ్ అయ్యారు. అప్పటికే షోయబ్‌కు సానియాతో జరిగింది రెండో పెళ్లి.
సానియా తర్వాత షోయబ్.. అదే ఏడాది రోజుల వ్యవధిలోనే సనా జావేద్(Sana Javed)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇజ్యాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఏడాదిన్న కలిసి జీవించిన తర్వాత ఇప్పుడు వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ మీడియాలో అనేక కథనాలు కూడా వచ్చాయి. కానీ వీరిద్దరిలో ఎవరూ కూడా ఇప్పటి వరకు అధికారికంగా అయితే ప్రకటించలేదు.
కొంతకాలంగా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, అనేక అంశాల్లో మనస్పర్థలు తలెత్తాయిన కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విడాకులు తీసుకుంటే ఇది షోయబ్(Shoaib Malik)కు ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోవడమే అవుతుంది. తొలుత 2002లో ఆయేషా అనే యువతిని షోయబ్ వివాహం చేసుకున్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2010లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అదే ఏడాది సానియాను వివాహం చేసుకున్నాడు.
Read Also: ఆసీస్‌తో సిరీస్‌కు జడేజా దూరం.. కారణం ఏంటో తెలుసా..?

