కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీలో బీఆర్ఎస్ (BRS) సభ్యుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గుంటే సభకు రాని చంద్రశేఖర్ రావు (KCR) చేత రాజీనామా చేయించాలని బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ (Minister Ponguleti) కుటుంబం అయినా, రేవంత్ రెడ్డి కుటుంబం అయినా ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా సీబీ సీఐడీ ముందు ఆధారాలు పెట్టాలని అన్నారు. సిగ్గులేని మాటలు మాట్లాడితే తనకు కూడా చికాకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనానికి కూడా హద్దు ఉంటుందన్నారు. రూ. ఒక కోటి 10 లక్షలు జీతం తీసుకొని సభకు రాకుండా ఉన్న కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు.
ఇంట్లో ఉన్నవాడు జీతం వాపస్ ఇవ్వడు కానీ, రోజూ 18 గంటలు పని చేసి నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఈరోజు లక్షలాది దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఇళ్లు ఇచ్చి వాళ్ళ ఇళ్లల్లో వెలుగు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలా? అని సీఎం (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడటాని కొంచెమైనా సిగ్గు ఉండాలన్నారు. మీరు చెప్పింది వినకపోతే మంత్రి రాజీనామా చేయాలా? మీ తాతలు దిగివచ్చినా మీరు అనుకున్నది జరుగదు అంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల సంగతి అంతా తెలుసన్నారు. పుట్టింటి గొప్పలు మేనమామకు చెప్పినట్లు ఉంది అని ఎద్దేవా చేశారు. గురువింద గింజ కింద ఎంత నల్లాల ఉందొ తెలియదు.. అలాగే వాళ్ళ కింద ఎంత నల్లగా ఉందో అంతా తనకు తెలుసు అంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యుల చిట్టా విప్పితే అస్సలు బాగుండదని అన్నారు.
Read Also: బ్లాక్ మెయిల్ చేయడానికే హౌస్ కమిటీ డిమాండ్: సీఎం రేవంత్
Follow Us On: Facebook

