తన సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన విరాట్ కోహ్లీ..!

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించిన విరాట్ కోహ్లీ (Virat Kohli), తన ఫామ్ వెనుక అసలు రహస్యాన్ని వెల్లడించారు. తనకు అందుతున్న బ్రేక్సే తన విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో కోహ్లీ విధ్వంసం సృష్టించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ తరఫున కోహ్లీ 38 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసి జట్టును సులభంగా గెలిపించారు. ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో ఆయన ఇన్నింగ్స్ మ్యాచ్‌ను ఏకపక్షంగా మలిచింది.

మ్యాచ్ అనంతరం స్పందించిన కోహ్లీ, గతంలో వరుస మ్యాచ్‌ల కారణంగా అలసటకు గురయ్యే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఇప్పుడు టెస్ట్, టీ20ల నుంచి విరమణ తర్వాత లభిస్తున్న విరామాలు తనకు శారీరకంగా, మానసికంగా కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని వివరించారు. ఈ విరామాల వల్ల మైదానంలోకి వచ్చినప్పుడు పూర్తి శక్తితో ఆడగలుగుతున్నానని తెలిపారు. మరింతగా, తాను ఎప్పుడూ పూర్తి సిద్ధతతోనే మ్యాచ్‌లకు వస్తానని, తక్కువగా సిద్ధమై ఆడే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఉత్సాహం కలిసి మంచి ప్రదర్శనకు దోహదపడుతున్నాయని తెలిపారు.

జట్టుకు సహకరించడం తన ప్రధాన లక్ష్యమని, కేవలం జట్టులో స్థానం కోసం ఆడటం తన ఉద్దేశం కాదని కోహ్లీ అభిప్రాయపడ్డారు. జట్టు విజయానికి తోడ్పడటమే తన అసలు ధ్యేయమని స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, దేవదత్ పడిక్కల్ 61 పరుగులు, రాజత్ పటిదార్ 31 పరుగులతో కోహ్లీకి మంచి మద్దతు ఇచ్చారు. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇషాన్ కిషన్ 80 పరుగులతో మెరిసినా జట్టు ఓటమిని తప్పించలేకపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>