శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కలం, వెబ్‌ డెస్క్‌ : శ్రీకాకుళం (Srikakulam) జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వైపు వెళ్తున్న క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డివైడర్‌ను దాటుకుని అవతలి వైపునకు దూసుకెళ్లిన బొలెరో.. ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>