Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. బస్సులో మహిళపై అత్యాచారం

కలం, వెబ్ డెస్క్ : భారత దేశంలో మరో నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో మహిళపై సామూహిక అత్యాచారం (Delhi Gang Rape) జరగడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కొన్నేళ్ళ క్రితం జరిగిన నిర్భయ ఘటనను గుర్తు చేస్తూ కదులుతున్న ఓ ప్రైవేట్ బస్సులో మహిళ పై సామూహిక అత్యాచారం జరిగింది.

రాణిబాగ్ లో బస్సు కోసం వేచి చూస్తున్న మహిళను బస్సులోకి బలవంతంగా లాక్కెళ్లిన డ్రైవర్, కండక్టర్ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. సోమవారం జరిగిన ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ అత్యాచార ఘటనతో ఢిల్లీలో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.

Read Also:  కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>