కలం, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలు పెట్రోల్ , డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ఇటీవల ప్రధాని మోదీ (Modi) ఇచ్చిన పిలుపు మేరకు తన కాన్వాయ్‌లో 50 శాతం వాహనాలను తగ్గించాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే మోదీ సైతం తన కాన్వాయ్‌ని భారీగా తగ్గించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగనున్న నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని మోదీ సూచించారు. స్వయంగా ప్రధాని పాటిస్తుండటంతో ప్రజలకు స్ఫూర్తిగా నిలిచేందుకు పవన్ కల్యాణ్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. పవన్ నిర్ణయంపై డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. అమరావతితో పాటు ఇతర జిల్లా పర్యటనల సమయంలో కూడా కాన్వాయ్‌లో సగం వాహనాలనే వినియోగించాలని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇంధన పొదుపు కోసం ఈ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

