Mobile Popup Ad
Mobile Popup Ad

పీకల్లోతు కష్టాల్లో రాజస్థాన్.. అదరగొడుతున్న ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు..

కలం, స్పోర్ట్స్ : ఉప్పల్ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs RR), ఆపై బౌలింగ్‌లోనూ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు యువ బౌలర్ ప్రఫుల్ హింజ్ తన తొలి ఓవర్‌లోనే చుక్కలు చూపించాడు. వేసిన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించాడు. రెండో బంతికే వైభవ్ సూర్యవంశీని సలీల్ అరోరా చేతికి చిక్కించిన ప్రఫుల్, ఆ తర్వాత వరుసగా ధ్రువ్ జురెల్ (0), లువాన్-డ్రే ప్రిటోరియస్ (0)లను పెవిలియన్ పంపి రాజస్థాన్ టాప్ ఆర్డర్‌ను క్లీన్ స్వీప్ చేశాడు. అనంతరం సాకిబ్ హుస్సేన్ తన వంతుగా ప్రమాదకర యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేయడంతో, రాజస్థాన్ కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బౌలర్ల అటాకింగ్‌తో ఉప్పల్ గ్యాలరీ హోరెత్తిపోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>