Mobile Popup Ad
Mobile Popup Ad

తొలి మ్యాచ్‌లోనే ప్రఫుల్ హిస్టరీ.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రఫుల్ హింగే (Prafull Hinge).. ఐపీఎల్ (IPL) చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఎందరో దిగ్గజ బౌలర్లు అరంగేట్రం చేశారు. కానీ విదర్భ ఎక్స్‌ప్రెస్ ప్రఫుల్ హింగే సృష్టించిన ప్రకంపనలు మాత్రం అద్వితీయం. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన ఈ యువ సంచలనం, తన అరంగేట్రం మ్యాచ్‌లోనే రికార్డుల రారాజుగా అవతరించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా ప్రఫుల్ చరిత్ర సృష్టించాడు. అటాకింగ్ లెంగ్త్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, వేసిన రెండో బంతికే వికెట్ల వేట మొదలుపెట్టి కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి మూడు ప్రధాన వికెట్లు కూల్చడం స్పోర్ట్స్ ఎనలిస్టులను సైతం ఆశ్చర్యపరిచింది.

రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో మొదటి ఓవర్‌లోనే ముగ్గురు కీలక బ్యాటర్లను (వైభవ్, జురెల్, ప్రిటోరియస్) డకౌట్‌గా వెనక్కి పంపడం అంటే అది మామూలు విషయం కాదు. గతంలో ఎంతో మంది స్టార్ బౌలర్లు తొలి ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన దాఖలాలు ఉన్నాయి కానీ, ఏకంగా మూడు వికెట్లతో క్లీన్ స్వీప్ చేయడం ప్రఫుల్ హింగేకు మాత్రమే సాధ్యమైంది. ఒక అరంగేట్రం బౌలర్ తన కెరీర్ మొదలుపెట్టిన తొలి ఆరు బంతుల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చేయడం ఐపీఎల్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. రాజస్థాన్ బ్యాటర్లు ప్రఫుల్ వేగవంతమైన స్వింగ్‌ను అంచనా వేయలేక చేతులెత్తేశారు. ఈ ప్రదర్శనతో ప్రఫుల్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోవడమే కాకుండా, సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో కొత్త ఆశలు రేకెత్తించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>