కలం, వెబ్ డెస్క్: చెన్నైలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ముప్పుతిప్పలు పెట్టింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రేవిస్ 44 పరుగులకే సీఎస్‌కే వింగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రావడమే విజృంభించేలా అదరగొట్టిన సంజూ శాంసన్‌కు కమిన్స్ బ్రేకులు వేశాడు. ఆ తర్వాత సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్‌ను కూడా కమిన్సే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ఊర్విల్.. మైదానంలోకి అడుగుపెడుతూనే రెండు సిక్సర్లతో వీరవిహారం చేయడానికి సిద్దమవుతుంటే హుస్సేన్.. వికెట్ పడగొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై భారీ స్కోరు సాధించే అవకాశాన్ని కోల్పోయింది. మిడిలార్డర్‌లో వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించాడు.
చెన్నై (CSK) ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు సంజూ శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదిగా ప్రారంభించారు. రావడమే విజృంభించేలా కనిపించిన సంజూ శాంసన్ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి జోరు మీదుండగా పాట్ కమిన్స్ బ్రేకులు వేశాడు. ఇషాన్ కిషన్ చేతికి క్యాచ్ ఇచ్చి సంజూ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఊర్విల్ పటేల్ కేవలం 8 బంతుల్లోనే 2 సిక్సర్లు బాది 13 పరుగుల వద్ద సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కార్తీక్ శర్మ 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి కమిన్స్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో ఎక్కువ సమయం గడిపినా వేగంగా ఆడలేకపోయాడు. ఆయన 21 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి మలింగ పట్టిన అద్భుత క్యాచ్‌కు కమిన్స్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సీఎస్‌కే కష్టాల్లో పడింది.
Read Also: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టికెట్ల షెడ్యూల్ విడుదల
Follow Us On: WhatsApp

