Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టికెట్ల షెడ్యూల్ విడుదల

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. టాటా ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ కీలకమైన ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయాల కోసం బీసీసీఐ ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ సంస్థను అఫీషియల్ టికెటింగ్ ఏజెన్సీగా నియమించింది. దీంతో ఎంతో ఉత్కంఠభరితంగా సాగే నాకౌట్ పోరును స్టేడియంలో ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానుల నిరీక్షణకు తెరపడింది.

ఈ టికెట్ల విక్రయాలు వేర్వేరు తేదీల్లో, ప్రత్యేక విండోల ద్వారా జరగనున్నాయి. ముందుగా రూపే క్రెడిట్ కార్డ్ ఉన్న వారికి బీసీసీఐ ప్రత్యేకంగా 24 గంటల ముందస్తు అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా మే 20, 2026 నుంచి రూపే కార్డ్ హోల్డర్లు మే 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్-1 మ్యాచ్‌కు, అలాగే మే 27న న్యూ చండీగఢ్‌లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌కు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సాధారణ అభిమానుల కోసం మే 21 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల తాలూకు ఫేజ్-1 టికెట్ల అమ్మకాలు మొదలవుతాయి.

ఇక టోర్నీలో (IPL 2026) అత్యంత కీలకమైన చివరి రెండు మ్యాచ్‌ల విషయానికి వస్తే, రూపే కార్డ్ హోల్డర్ల కోసం మే 22 నుంచి టికెట్ల విండో ఓపెన్ అవుతుంది. వారు మే 29న న్యూ చండీగఢ్‌లో జరిగే క్వాలిఫైయర్-2 మ్యాచ్‌కు, అలాగే మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. మిగిలిన సాధారణ ప్రజల కోసం మే 23 నుంచి క్వాలిఫైయర్-2, ఫైనల్ మ్యాచ్‌ల ఫేజ్-1 టికెట్ల విక్రయాలు అందుబాటులోకి వస్తాయి.

Read Also: కుస్తీ పోటీల్లో తెలంగాణ విద్యార్థుల హవా

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>