Mobile Popup Ad
Mobile Popup Ad

వికారాబాద్ జిల్లాలో మరో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం

కలం, క్రైమ్ బ్యూరో : వికారాబాద్ జిల్లాలో మరోసారి పోక్సో కేసు కలకలం రేపింది. ఇటీవల యాలాల్ మండలంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారనికి పాల్పడ్డాడు. ఈ ఘటన మారువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణంలో (Tandur POCSO Case) ఓ మైనర్ బాలిక పై శివకుమార్ అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే .. బొంరాస‎పేట్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక తాండూరు (Tandur) పట్టణంలో తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో గౌతపూర్ గ్రామానికి చెందిన శివకుమార్‎తో బాలికకు పరిచయం ఏర్పడింది. అయితే శివకుమార్ సదరు బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి కావడంతో కుటుంబసభ్యులు సదరు బాలికను నిలదీశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబసభ్యులు ఆదివారం తాండూర్ పట్టణం పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శివకుమార్ పై పోక్సో కేసు (POCSO Case) నమోదు చేశారు.

గత మూడు రోజుల క్రితం యాలాల్ మండలంలో మైనర్ బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఓ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన షేక్ ఫరన్ (19)అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో “చార్జర్ కావాలి, నీళ్లు కావాలి” అనే సాకుతో ఇంట్లోకి నిందితుడు వెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు యాలాల పోలీస్ స్టేషనులో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు.

Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>