కలం, సినిమా : ఇండస్ట్రీలో లక్ కీ రోల్ ప్లే చేస్తుంటుంది. హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కెరీర్ చూస్తే.. లక్ ఆమెతో ఎలా ఆడుతుందో తెలుస్తుంది. ధమాకా హిట్‌తో శ్రీలీల ఒక్కసారిగా స్టార్ డమ్ దక్కించుకుంది. అందం, డ్యాన్సులతో పాపులారిటీ తెచ్చుకుని యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. అక్కడి నుంచి స్టార్ హీరోలతో వరుసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే ఏ లక్ ఆమెను అనూహ్యంగా స్టార్‌ను చేసిందో, ఇప్పుడు అదే లక్ ఆమెకు కలిసి రావడం లేదు. శ్రీలీలకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడుతున్నాయి. ఇందులో ఆమె తప్పేం లేదు. అలా అని ప్రయత్న లోపమూ లేదు.
గతేడాది తెలుగులో రాబిన్‌హుడ్, మాస్ జాతర సినిమాలతో శ్రీలీల అపజయాలు చూసింది. ఇలా తెలుగులోనే కాదు తమిళనాట అడుగుపెట్టిన శ్రీలీలకు (Sreeleela) అక్కడ పరాశక్తి (Parasakthi) సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. గత శనివారం థియేటర్స్ లోకి వచ్చిన పరాశక్తి సినిమా మిక్స్డ్ టాక్ తో డల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే శ్రీలీలకు కోలీవుడ్‌లో ఇంకొంత కాలం కెరీర్ ఉండేది. ఇప్పుడు ఆమెకు అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి.
పరాశక్తి సినిమాను పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara) రూపొందించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్ నిర్మించారు. శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా నటించగా, జయం రవి, అధర్వ (Atharvaa) ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 60వ దశకంలో తమిళనాట జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా, సినిమాటిక్‌గా ఎంగేజింగ్‌గా రూపొందించడంలో డైరెక్టర్ సుధా కొంగర తడబడ్డారనే రివ్యూస్ ఈ మూవీకి వచ్చాయి.
Read Also: జోరుగా మెగా సంబరాలు
Follow Us On : WhatsApp


