కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) వేదికల విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల బంగ్లాదేశ్ (Bangladesh), భారత్ క్రికెట్ బోర్డుల మధ్య వాతావరణం వేడెక్కింది. తమ ప్లేయర్లకు భారత్‌లో భద్రత లేనందున.. బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లకు భారత్‌లో ఉన్న వేదికలను మార్చాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. బంగ్లాదేశ్ జట్టు భద్రతా ఆందోళనల కారణం ఐసీసీ భారత్‌లో ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తోంది. మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకకు తరలించాలన్న బీసీబీ అభ్యర్థనకు ఐసీసీ ఇప్పటివరకు సానుకూలంగా స్పందించలేదు.
టీ20 వరల్డ్ కప్ లో (T20 World Cup) చెన్నై, త్రివేండ్రం వేదికలు పరిశీలనలో ఉన్నాయి. చెన్నై ఇప్పటికే అధికారిక వేదికగా ఉంది. త్రివేండ్రం ప్రథమ జాబితాలో లేనప్పటికీ భద్రతా పరిస్థితుల కారణం పరిశీలనలో ఉంది. ముందుగా బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్‌తో కోల్‌కతాలో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడాలి. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‌తో మ్యాచ్ ఉంది. భద్రతా సమస్యల కారణం షెడ్యూల్ మార్పు రాబోయే వారాల్లో నిర్ధారించబడే అవకాశం ఉంది.
Read Also: స్పానిష్ సూపర్ కప్ ఛాంపియన్ బార్సిలోనా
Follow Us On: Sharechat


