కలం, వెబ్‌డెస్క్: డాక్టర్ అవబోయి యాక్టర్ అయ్యాను అనే మాట ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్. ఆ మాటను నిజం చేశారు నటి శ్రీలీల (Sreeleela). కాకపోతే యాక్టర్ అయ్యాకే డాక్టర్ అయ్యారు. ఈ మేరకు ఎంబీబీఎస్ పట్టాను ఆమె అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీలీల.. మహారాష్ట్రలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో (DY Patil University) ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే సినిమాల్లోకి వచ్చారు. మొదట కన్నడ సినిమా ‘కిస్’తో వెండితెర మీద అడుగుపెట్టారు. తెలుగులో పెళ్లిసందD మొదటి సినిమా. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. అయితే, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఖాళీ సమయాల్లో చదువుకొని, పరీక్షలు రాస్తూ పాస్ అయ్యారు. చివరికి డాక్టర్ పట్టా అందుకున్నారు. కాగా, శ్రీలీల (Sreeleela) తల్లి స్వర్ణలత కూడా డాక్టరే.
Read Also: సంచలనంగా మారిన 42 రూల్స్.. బన్నీ టీమ్ రెస్పాండ్
Follow Us On : WhatsApp


