జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ సంఘాలు స్పందించాలి : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి లో మున్సిపల్ పోలింగ్ సందర్భంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెండ్​ జగ్గారెడ్డి పై డీజీపీ స్వయంగా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) డిమాండ్​ చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగ్గారెడ్డి పై చింతా ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో పోలీస్ సంఘాలు ఎలా స్పందించాయో.. ఇప్పుడు కూడా అదే విధంగా స్పందించాలని కోరారు. పోలీసులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడిన తీరు పూర్తిగా అవమానకరమన్నారు. పోలింగ్ సమయంలోనే ఇలా ప్రవర్తిస్తే, కౌంటింగ్ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు.

Read Also: కరీంనగర్‌లో ‘పొత్తు’ పొడుపు – కమలం, గులాబీ స్నేహం ?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>