కలం, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఇలాంటి అరాచక పాలనను తాము ఎన్నడూ చూడలేదని.. పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని చేసినా ఓటర్లను ప్రభావితం చేయలేవని.. కాంగ్రెస్ సాగిస్తున్న ఈ అరాచక పాలనకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని హరీష్ రావు విమర్శించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని శక్తులను వాడిందని.. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని చెప్పారు హరీష్ రావు.
నామినేషన్ల సమయం నుంచి పోలింగ్ దాకా కాంగ్రెస్ చేసిన అరాచకాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం అంటూ హరీష్ చెప్పారు. ‘బీఆర్ ఎస్ అభ్యర్థులను బెదిరించడం, భౌతిక దాడులకు పాల్పడటం నీచమైన రాజకీయం. పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తిన తీరు గర్హనీయం. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా సరే ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టలేవు. కాంగ్రెస్ దాడులకు బెదరకుండా బీఆర్ ఎస్ అభ్యర్థులు పోరాడిన తీరు అభినందనీయం అని హరీష్ రావు (Harish Rao) తెలిపారు.
Read Also: జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ సంఘాలు స్పందించాలి : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Follow Us On: Instagram


