కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విన్నపాన్ని మన్నిస్తూ ఆ దేశ ఇంధన ప్లాంట్లపై చేపట్టాలనుకున్న దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ 6న రాత్రి 8 గంటల వరకు ఈ గడువు ఉంటుందని ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఇరాన్ (Iran)తో జరుగుతున్న చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో మీడియా, ఇతరులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. చర్చల పురోగతి పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని, పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. గతంలో ఇరాన్ హోర్మూజ్‌ను మూసివేయడంతో, ఆ దేశ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఇరాన్ పంపిన ఎనిమిది చమురు నౌకలను బహుమతిగా పరిగణించిన ట్రంప్, చర్చల కోసం వారికి అదనపు సమయం ఇచ్చారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.
Read Also: సౌత్ వర్సెస్ నార్త్.. ‘ఢీ’ లిమిటేషన్
Follow Us On: Instagram

