భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

క‌లం, వెబ్ డెస్క్‌: నేడు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం (Bhadrachalam)లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణ (Seetha Rama Kalyanam) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతులు స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు, త‌లంబ్రాలు స‌మ‌ర్పించారు. భద్రాచలం ఆలయానికి సంబంధించి రూ.351 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

వేద మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీరాముడికి రామమాడ పతక ధారణ నిర్వహించారు. కన్యాదాన మహా సంకల్పాన్ని పఠించారు. సీతారాముల వారికి పుణ్యాహవాచనం, మధుపర్క ప్రాసన, యోత్ర ధారణ జరిపించారు. శ్రీరాముడికి పచ్చల పతకం, సీతమ్మ వారికి చింతాకు పతక ధారణ జరిపించారు.

ఈ వేడుక‌ల‌కు సీఎం రేవంత్ (CM Revanth) కుటుంబంతో పాటు, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కుటుంబం, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ హాజ‌ర‌య్యారు. కల్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌భుత్వం భ‌క్తుల రాక‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని వ‌స‌తులు క‌ల్పించింది.

Read Also: ఇన్‌స్టా ప్రేమ విషాదాంతం : ఏలూరు జిల్లాలో జంట ఆత్మహత్య

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>